-సేవలన్నీ ఉచితం : జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
-రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన మంత్రి
సోమేందపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, మరియు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖామాత్యులు సవితమ్మ, పేర్కొన్నారు. శుక్రవారం పెనుగొండ నియోజకవర్గంలోని సోమేందపల్లి మండలంలోని నాగి నాయిని చెరువు గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనం ఆవరణలో గ్రామంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను అంతకుముందు పరిశీలించారు. సదస్సులో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తాసిల్దార్ చదివి వినిపించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ, ఇది మంచి ప్రభుత్వము నేటి నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాల పరిష్కారమే అజెండాగా, రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చేనెల 8వరకూ 33 రోజులపాటు, సుమారు 17 వేల 564 గ్రామాల్లో సదస్సులు జరగనున్నాయి. 2019కి ముందు భూముల రికార్డులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. సదస్సుల్లో వచ్చే విజ్ఞాపనల్ని 45 రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.ప్రజలనుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో పలు లోపాలు చోటుచేసుకున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సరైన విధానం, మార్గదర్శకాలు లేకుండా, తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా సర్వే చేయించారని అన్నారు. రీసర్వేలో జరగిన లోపాలపై సుమారు కొన్ని వేలకు పైగా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ6 సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇది గొప్ప సదవకాశామని, దీనిని వినియోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు కూడా లేకుండా పోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సర్పంచులకు అధిక ప్రాధాన్తీస్తూ ప్రతి పంచాయతీకి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి అధిక మొత్తం నిధులు మన రాష్ట్రానికి తెప్పించడానికి కృషి చేయుచున్నారని ఆమె తెలిపారు, సర్పంచులతో గ్రామీణ ప్రజలు పనులు చేయించుకోవాలని ఆ బాధ్యత మీ పైన ఉన్నదని తెలిపారు, సచివాల సిబ్బంది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు మీరు అందజేయాలని సూచించారు. మన రాష్ట్రంలో ఒకటో తేదీని ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయుచున్నామని, ఏ రాష్ట్రంలో కూడా ఇది సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు, దీపం 2 పథకం కింద మహిళలకు సిలిండర్లు పంపిణీ చేయుచున్నామని, పార్టీలు అతీతంగా అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని తెలిపారు,
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రభుత్వ సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందవచ్చునని, ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 70 శాతానికి పైగా అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వస్తున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో కూడా సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. వీలైనంత వరకు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. జిల్లా అధికారులు, డిప్యుటీ కలెక్టర్లతోపాటు అన్ని శాఖల అధికారులను సదస్సులవద్ద అందుబాటులో ఉంచామని తెలిపారు. వచ్చిన ఆర్జీలను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరిస్తామని చెప్పారు.రోజుకో గ్రామం చొప్పన మొత్తం 33 రోజులపాటు సదస్సులను నిర్వహించేందుకు షెడ్యూల్‌ను రూపొందించామని తెలిపారు. ప్రతీ అర్జీకి రసీదును అందజేస్తామన్నారు. చిన్న సమస్యపైన కూడా అర్జీ అందజేయవచ్చునని చెప్పారు. సదస్సులు ముగిసిన 45 రోజుల్లోగా వచ్చిన వినతులను పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెనుగొండ ఆర్డిఓ ఆనంద్, మండల స్పెషల్ ఆఫీసర్ అశ్వత్ నాయక్, సర్పంచ్, ఎంపీటీసీ వెంకటేష్, లింగప్ప, ఎంపీడీవో విజయలక్ష్మి దేవి, ఎమ్మార్వో రెడ్డి శేఖర్ రెవిన్యూ టీమ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News