-జిల్లా లో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నాం
-మధ్యాహ్న భోజన పథకం వంటలకు ప్రశంస.. ఇరువురు ఆయాలకు చీరల బహుకరణకు ఆదేశం
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలకు మమేకం చేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసే దిశగా ఈ మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం కొవ్వూరు పట్టణం లోని అల్లూరి నాగరత్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మిడ్ డే మిల్స్ తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థినిల తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాల పరిస్థితులను, ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి సహ పంక్తి భోజనం చేయడం ఆనందంగా ఉందన్నా రు. చక్కగా వంట చేసిన ఆయాలని కలక్టర్ ప్రశంసించి, వారికి చీరలను బహుమతిగా ప్రకటించడం జరిగిందని తెలిపారు.
ఉపాధ్యాయులు, పిల్లల తల్లి దండ్రులకు పిల్లల చదువు పై జవాబుదారీ తనం పెంచడానికి పేరెంట్ – టీచర్ మెగా సమావేశాల ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు. విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం దన్నారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు విధానంతో తల్లిదండ్రు లను పాఠశాలలకు మమేకం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నేడు జరిగే మెగా పేరెంట్స్ సమావే శాలు హోలీ స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పంపిణీ ని పండగ వాతావరణంలో నిర్వహించారన్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ఉత్తమ ప్రమాణాలతో భోధన ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏకకాలంలో ఈ ఆత్మీ య సమావేశాలు నిర్వహిస్తు న్నట్లు కలెక్టరు ప్రశాంతి తెలిపారు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయో ఇలాంటి సందేహాలు ప్రతి తల్లిదండ్రులకు వస్తాయని ఆ విషయాలు తెలుసుకోవాలంటే చదువు తో పాటు ప్రతిభ గురించే తెలియ జేసే ప్రోగ్రెస్ కార్డు కావాల్సిందేనని ఆ విధానం ఇన్నాళ్లూ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లలో మాత్రమే ఉండేదన్నారు. ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో కూడా సమగ్ర ప్రగతి పత్రం ప్రోగ్రెస్ కార్డు అందుబాటు లోకి వస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లి దండ్రులకు కూడా ప్రోగ్రెస్ కార్డు ఇకపై సంతకం చెయ్యలయన్నారు. హోలీ స్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరుతో ప్రతి విద్యార్థికి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నా రు. విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు రెండు రోజులకు ఒకసారి భోజనంలో మెనూ మార్చాలని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలో షెడ్డు ఉందని, దాని శిథిల పరిచి ఆట స్థలంగా మార్చా లని కలెక్టర్ దృష్టికి విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకువచ్చా రు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కే వాసుదేవరావు, ఎంఈఓ, కే రామ కిషోర్, హెచ్ ఎం, టీఎస్ రామానుజం, మండల తాహసిల్దార్, ఎం.దుర్గాప్రసాద్,, పి టి, ఎస్.నాగ రాజు, సి ఆర్ పి, యు అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News