విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన టి.డి.పి. యాప్ ను చురుగ్గా వినియోగిస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ఒక డిజిటల్ సైనికుడిలా నిరంతరం శ్రమించిన ఏడుగురు పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బహుమతులను అందజేసింది. సదరు గిఫ్టు పాకెట్లను అడపా శివనాగేంద్రారావు, మాదల రాజ్యలక్ష్మి, బొల్లా ధన్యశ్రీ, పెరసాని వసంత్, వి.ఎం.ఎస్.రావ్, కొత్తా మురళి, కోగంటి రాంబాబులకు కార్యకర్తలకు సోమవారం నాడు విజయవాడ తూర్పు కార్యాలయమునందు శాసనసభ్యులు గద్దె రామమోహన్ అందజేసి, వారందరికీ అభినందనలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News