Breaking News

పాత పెన్షన్ సాధన కోసం మద్దత్తు ప్రకటించిన ఎం.డి.జాని పాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10న APCPSEA ఆధ్వర్యంలో CPS రద్దు కోసం విజయవాడలో చేపట్టిన కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రి.నెం:138/2020 ఆధ్వర్యంలో 1.34లక్షలగ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తూ సభలో పాల్గొని CPS ఉద్యమానికి మద్దత్తు ప్రకటిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ప్రసంగించారు.

జాని పాషా మాట్లాడుతూ పాత పెన్షన్ సాధన కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అవుదామని,మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన అంశం జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ సాధించడం కోసం సి.పి.యస్ ఉద్యోగులు తోడ్పాటు అందించాలని విన్నవించారు. ప్రస్తుత పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ కు బదిలీ చేయడం ద్వారా తదుపరి పదోన్నతి సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ సాధించడం కోసం ఫెడరేషన్ తీవ్రంగా కృషి చేస్తుంది. యువ ఉద్యోగులైన మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా రాబోయే మన భవిష్యత్తు కోసం పాత పెన్షన్ సాధించడం కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొని మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం.పాత పెన్షన్ సాధనకు ఐక్యంగా కృషి చేద్దాం.

విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యస్.కె.మహబూబ్ సుభాని, రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ యల్.అర్చన, మహిళా విభాగం కన్వీనర్ బి.శ్వేత, రాష్ట్ర సమన్వయకర్త ఎం.శశిధర్, రాష్ట్ర సహాయకార్యదర్సులు కె.సామ్యూల్,జి.నవీన్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మనోహర్, విజయవాడ నగర కార్యదర్శి జి.గోపయ్య, కోశాధికారి కె.రాజ్ కిరణ్, సి.హెచ్.రామకృష్ణ, బి.గోపాల్ నాయక్, ఎం.శైలేష్, కె.రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *