Breaking News

పాడి పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా గోకులాల నిర్మాణం

-పాడి, పంటల అభివృద్దే దేశాభివృద్ధి
-గోకులం పథకం కింద షెడ్లనిర్మాణానికి పశువుల పెంపకందార్లకు 90శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందార్లకు 70 శాతం చొప్పున రాయితీలు
-ఉపాధి హామీ పథకం కింద రాయితీ
-పశుపోషకుల్లో ఆనందం
-రూ.2.30 లక్షలతో నిర్మించిన గోకులన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు
-జిల్లాలో మూగజీవుల సర్వే చేయించి ఇంటింటికి వెళ్లి మూగజీవులకు నెక్కల మందులు పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం మాది..

ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. శనివారం ఆగిరపల్లి మండలము నెక్కలం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.2.30 లక్షలతో నిర్మించిన గోకులం చెడ్డును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల మంజూరుకు శ్రీకారం చుట్టిందన్నారు. గత వైసీపీ పరిపాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తోందన్నారు. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ, పెంపకందార్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీగోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. పాడి రైతులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 90 శాతం సబ్సిటీ తో ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని ఆర్హులైన ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పశువుల షెడ్ల నిర్మాణానికి రైతులు సహకరించి తద్వారా పశువుల పెంపకం అభివృద్దితో దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. పశు సంవర్ధక శాఖ మరియు జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక రైతులకు,పశువుల పెంపకం దారులకు నిరుద్యోగులకు ప్రోత్సాహంగా ప్రభుత్వము అనేక రుణాలు అందజేస్తుందన్నారు.
వీటిని ప్రతీ ఒక్క పశువుల పెంపకం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.సన్న ,చిన్నకారు రైతులు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్ధిక రుణాలను అంది పుచ్చుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి రుణాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సన్న, చిన్న, కారు రైతులకు ప్రోత్సాహకరమైన ఋణాలు అందుబాటులో ఉన్నాయి అని వాటిపై అవగహన పెంచుకొని ఋణాలను పొందాలని తద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని రైతులకు పిలుపు నిచ్చారు.
రైతులకు, ఋణాలపై అవగహన మరియు వాటి లబ్ధిపై, వాటిని పొందే విధానంపై బ్యాంకర్స్, మరియు, అగ్రికల్చర్, ఇతర ప్రభుత్వ అధికారులు కలిసి ప్రతీ నెల ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు,ముక్యంగా పశువుల పెంపకం దారులకు ఋణాలను అందించే భాద్యత మీ పై ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించారు. అలాగే ఆధునిక ప్రపంచంలో వ్యాపారంలో పోటీ పడాలంటే ఆధునిక టెక్నాలజీ జోడించి వ్యాపారం చేస్తే ఆర్ధిక ఫలాలు లాభాలు అంది పుచ్చుకోవచ్చని మంత్రి సూచించారు. గొర్రెలు, మేకలు,పశువుల, మూగ జీవుల ఫామ్స్ నిర్మాణానికి కోటి రూపాయలు వరకు ఋణం 50 శాతం సబ్సిటీతో ప్రభుత్వం అందిస్తుందన్నారు.దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడి ఋణాలను విస్తృతంగా గ్రామ స్థాయిలో ప్రసారం చేయవలసిన బాధ్యత బ్యాంకర్స్, మరియు ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు.ఏ ఒక్క రైతులకు బ్యాంకర్స్ ఋణాలు ఇవ్వమని చెప్పిన పక్షంలో నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే బ్యాంకర్స్ తో మాట్లాడి ఋణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక అధికారులు, స్థానిక తెలుగుదేశం,కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *