-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ, నగర పోలీస్ కమీషనర్ పి.రాజశేఖర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ, నగర పోలీస్ కమీషనర్ పి.రాజశేఖర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు వివరించారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నత అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ, నగర పోలీస్ కమీషనర్ పి.రాజశేఖర్ బాబు వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ ఈనెల 26వ తేదిన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు నిర్వహించే రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రిపబ్లిక్ డే పరేడ్ ఛీఫ్ కోఆర్డినేటర్ సంబంధిత విభాగాల సంస్థల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితర ప్రముఖులు పాల్గొంటారని ఇందుకు మినిట్ టు మినిట్‌ను అనుసరించి తగు ఏర్పాట్లు చేస్తున్నాట్లు వివరించారు. వివిఐపిల రాకపోకలను సంబంధిత వ్యక్తిగత కార్యదర్శులతో సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన వేదికను ఫ్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించి, స్టేడియం నందు పోర్ట్ వాల్ డిజైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నగర పోలీస్ కమీషనర్ పి. రాజశేఖర్ బాబు మట్లాడుతూ వేడుకలలో పాల్గొనేందుకు విచ్చేసే విఐపి వాహనాలకు ప్రత్యేక ప్రాక్సిమేట్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో వేడుకల రిహార్స్‌ల్స్ నిర్వహించాలని, ఫుల్ డ్రస్ రిహార్స్ల్స్తో పరేడ్‌ను సిద్దం చేస్తామన్నారు. వివిఐపి, విఐపిలు ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేడుకల్లో ఆర్మీ కంటెంజెంట్ రాష్ట్ర పోలీస్ బెటాలియన్స్, ఎన్సిసి స్కౌట్ అండ్ గైడ్స్, పోలీస్ బ్యాండ్ వంటి విభాగాలు కవాతులో పాల్గొంటారన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కు వివరించారు.
Prajavartha Online Telugu News