Breaking News

జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 9 ఒపెన్ రిచెస్ వద్ద 5,51, 000 మెట్రిక్ టన్నులు ఇసుక ,10 డిసిల్టేషన్ పాయింట్లు వద్ద 5,37,018 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటు లో ఉందని, త్వరలో మరో 10 ఒపెన్ రిచెస్, ఆరు సెమీ మెకన్సైజ్డ్ రిచెస్ 77 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో తీసుకొని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, మార్గదర్శకాల ప్రకారం బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకు మార్గదర్శకాల మేరకు ఇసుక రిచ్ లలో త్రవ్వకాలు లోడింగ్ కు అనుమతించడం జరిగిందన్నారు. సెమీ మెకానైజ్డ్ ఒపెన్ సాండ్ రిచెస్ పబ్లిక్ హియరింగ్ కి చెంది నిడదవోలు మండలం పురుషోత్తం పల్లి రీచ్ కి ఫిబ్రవరి 10, కొవ్వూరు ఆరికిరేవుల రీచ్ 11 న , తాళ్లపూడి మండలం తాడిపూడి , ప్రక్కిలంక రిచ్ 12 న , నిడదవోలు మండలం పెండ్యాల , కొవ్వూరు మండలం చీడీపీ , సీతానగరం మండలం సింగవరం ఇసుక రిచ్ లకి ఫిబ్రవరి 13 న పబ్లిక్ హియరింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఆర్డీవోలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను అనుసరించి వ్యవహరించాలని కలెక్టరు సూచించారు.

పడవల ద్వారా నడపడానికి ఫోర్ షోర్ ప్రాంతం దాటి  డి సిల్టేషన్ కోసం అవకాశం ఉన్న రీచ్ లను చైనేజ్ ను అనుసరించి ర్యాంపు పాయింట్స్ గోదావరీ హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుర్తించిన వాటిపై తగిన అనుమతులు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కొత్తగా గుర్తించిన కడియం మండలం వేమగిరి ఏ, పెరవలి మండలం తీపర్రు ఏ, బి లు, నిడదవోలు మండలం జీడిగుంట ఏ , బి లు, పందలపర్రు కొత్తగా గుర్తించిన సెమీ మెకనైజ్డ్ రీచేస్ మైనింగ్ ప్లాన్ అనుమతికి ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని, ఇరిగేషన్ అధికారులు ద్వారా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.కొత్తగా గుర్తించిన కడియం మండలం వేమగిరి ఏ, పెరవలి మండలం తీపర్రు ఏ, బి లు, నిడదవోలు మండలం జీడిగుంట ఏ , బి లు, పందలపర్రు కొత్తగా గుర్తించిన సెమీ మెకనైజ్డ్ రీచేస్ మైనింగ్ ప్లాన్ అనుమతికి ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని, ఇరిగేషన్ అధికారులు ద్వారా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఏజెన్సీస్ నుంచు పరిపాలన పరమైన ఖర్చులను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.  జిల్లాలో ఇసుక రవాణా చేస్తూ నియమ నిబంధనలను ఉల్లంఘించిన 77 వాహనాలను సీజ్ చేసి, నాలుగు కేసులు నమోదు చెయ్యడం జరిగిందన్నారు. 480 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చెయ్యడం, రూ 24,71,000 అపరాధ రుసుం విధించడం, యంత్ర పరికరాల వాడకం, అధిక మొత్తంలో వసూలు నేపధ్యంలో మూడు రీచ్ ల కు చెందిన కాంట్రాక్టు ఉత్తర్వులు రద్దు చెయ్యడం జరిగిందని అధికారులు వివరించారు. అర్హత కలిగిన బోట్స్ మ్యాన్ సొసైటి లనుంచి వొచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వారికి అనుమతులు మంజూరు చెయ్యాలని కమిటి సమావేశం లో నిర్ణయించడం జరిగింది.  పట్టా ల్యాండ్ వద్ద పరిమితులకు లోబడి అనుమతులు మంజూరు చెయ్యాలని సూచించారు. అందుకు అనుగుణంగా సామర్ధ్యం అనుసరించి సి టి ఇ, సి టి వో లని జారీ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్ ,  రాణి సుస్మిత , జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, ఈ ఈ (ఇరిగేషన్ రివర్ కన్సర్వేటరీ) ఆర్. కాశీ విశ్వేశ్వర రావు,  జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్,  జిల్లా ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారి బి వి గిరి, ఇన్చార్జి డిపివో ఎమ్. నాగలత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు , ఇరిగేషన్ డి ఈ బాబు పోల్యూషన్ కంట్రొల్ బోర్డ్ అధికారిలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *