గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్టానిక టి జె పి యస్ కళాశాల లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా రోడ్డు రవాణా శాఖ వారు మరయు సుదీష్ణ ఫౌండేషన్ & జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో రహదారి భద్రతా అవగాహనా కార్యక్రమం జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యస్ అనితా దేవి తెలియచేశారు.ఈ కార్యక్రమానికి లో ముఖ్య అతిధిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ రోడ్డు నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ నియమాలు పాటించడం వలన మనమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు కూడా సంతోషం గా ఉంటాయని పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ లో వివిధ కళాశాల ల విద్యార్థులు విచ్చేశారు. వీరికి పి. పి. టి. ల ద్వారా భద్రతా నియమాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. తరువాత అందరి చేత రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను, సెల్ ఫోన్ మాట్లాడాను, ఆల్కహాల్ తాగి డ్రైవ్ చేయను, అతి వేగం గా వెళ్ళను, సీట్ బెల్ట్ దరిస్తాను, హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను అనే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ తమ కళాశాల లో ని ప్రతి ఒక్క విద్యార్థులకు రహదారి నియమాలను తెలియచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండంట్ కె. వి. బ్రహ్మం, జాతీయ సేవా పథకం జిల్లా అధికారి డాక్టర్ జె వి సుధీర్ కుమార్, ఆర్ జయ శైలజ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందించారు
Prajavartha Online Telugu News