గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ లో సోమవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పక్కాగా, సజావుగా నిర్వహించాలని, ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. ఆదివారం ఉదయం కమిషనర్ ఎన్నికల అధికారి మరియు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మరియు ఇతర అధికారులతో కలిసి సోమవారం నిర్వహించనున్న స్టాండింగ్ కమిటి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
తొలుత ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచిక బోర్డులు, పోలింగ్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కంపార్ట్ మెంట్, బ్యాలెట్ బాక్స్, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. పోలింగ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాన్నం 3 గంటలకు ముగుస్తుందన్నారు. ఓటు వేయుటకు వచ్చే కార్పొరేటర్లుకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని, లోపలకు వచ్చు సమయంలో నగర పాలక సంస్థ జారీ చేసిన ఐడెంటి కార్డులు విధిగా కలిగి ఉండాలని, ఫోన్లు, ఎలక్ట్రికల్ సంబంధిత వస్తువులు మరియు ఏ ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడదన్నారు. కార్పోరేటర్ల ఇతర వస్తువులు భద్రపరచుటకు నగర పాలక సంస్థ పార్కింగ్ నందలి పౌరసేవా కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లోక్ రూమ్ నందు బద్రపరచుకోవాలన్నారు. పోలింగ్ సందర్భంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోకి ఇతర వాహనాలు పార్కింగ్ నిషేధించాదమైనదని, ఓటింగ్ కొరకు కార్యాలయానికి వచ్చే కార్పొరేటర్ల వాహనాలను గాంధి పార్క్ పార్కింగ్ నందు పార్కింగ్ చేయాలన్నారు. ఓటు వేయుటకు వచ్చు కార్పొరేటర్లు నగర పాలక సంస్థ ప్రధాన ద్వారం నుండి ప్రవేశించి పోలీస్ తనిఖీ అనంతరం పోలింగ్ కేంద్రంలో వారి ఓటు వినియోగించుకొని, నగర పాలక సంస్థ పార్కింగ్ ద్వారం నుండి బయటకు వెళ్ళేలా ఏర్పాట్లు చేశామన్నారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు విధిగా నగర పాలక సంస్థ గుర్తింపు కార్డుతో, వారికి కేటాయించిన విభాగాల్లోనే విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారలు సిబ్బంది ఉదయం 8 గంటలకల్లా గుర్తింపు కార్డుతో విధులకు హాజరుకావాలని, ఎన్నికల అధికారి తప్ప ఇతర ఎన్నికల సిబ్బంది ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడదన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశ ద్వారానికి, బయటకు వెళ్ళు ద్వారాలకు ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతతో పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారి మరియు డి.సి 1 డి. శ్రీనివాసరావు, కౌన్సిల్ సేక్రటరి పి. శ్రీనివాసరావు, ఓటర్ల గుర్తింపు అధికారి మరియు నగర పాలక సంస్థ మేనేజర్ షేక్ బాలాజీ బాషా, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పద్మనాభరావు, ఎన్నికల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News