
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. స్థానిక గాంధీనగర్ లో జింఖానా గ్రౌండ్స్ లో ఆదివారం టూవీలర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ,ఒంగోలు శాసనసభ్యులు దామచర్లజనార్దన్ రావు విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టూ వీలర్ వర్కర్స్ 8 0 లక్షలమంది కులాలకు అతీతంగా పనిచేస్తున్నారని, పేదలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేసినట్టే మా వర్కర్స్ అసోసియేషన్ కి అమలు చేయాలని మా వర్కర్స్ ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయిఅని మా కార్మికులకు ఇప్పుడు వచ్చే నూతన టెక్నాలజీతో బి. ఎస్. 5, బి.ఎస్ 6 ,బైక్ మీద స్కిల్ డెవలప్మెంట్ కోసం సబ్సిడీ లోన్లు, ఇన్సూరెన్స్ సౌకర్యం మా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఇవ్వాలని ,55 సంవత్సరాలకె వయస్సు పైబడిన వారికి5000 రూపాయలుపెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రతి టూవీలర్ వర్కర్ కి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందేటట్టు చూడాలని, ,ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని ఆయన కోరారు. మేము వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రతి టు వీలర్ వర్కర్స్ కి ఏ ఇబ్బంది వచ్చిన ఆర్థిక సహాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆయా జిల్లాల కలెక్టర్లకు అందరికీ వినతి పత్రాలు సమర్పించామని ఆయన అన్నారు. త్వరలోనే మా సమస్య లు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం యూనియన్ టూ వీలర్ అధ్యక్షులు సత్తిబాబు, కుమార్, విజయవాడ ప్రెసిడెంట్ ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వరరావు, అంతేకాకుండా రాష్ట్రంలోని 26 జిల్లాల నుండిఅన్ని యూనియన్ ప్రెసిడెంట్లు, వర్కర్స్, తదితరులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News