రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానవ రవాణా మరియు వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి ఎల్ ఎస్ ఏ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
హైకోర్టు ఆదేశముల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత అన్నారు. కరోనా సమయంలో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు చెక్కు రూపంలో నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారి నష్టపరిహార నిమిత్తం హైకోర్టులో అప్పులు చేసుకున్న వారికి సుమారు 60 లక్షల రూపాయలు వరకు నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. ప్రజలకు పథకాలు మరియు చట్టాలపై అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కొన్ని విధులను కూడా నిర్దేశించడం జరిగిందని తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.
సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలచే పనిచేయించడం చట్టరీత్యా నేరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. వారు తప్పనిసరిగా చదువుకునే విధంగా చట్టాలు ఉన్నాయని ఇది రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నదని ఆమె గుర్తు చేశారు. చిన్నపిల్లల చేత ఎవరైనా పనిచేస్తున్నట్లు తమకు సమాచారం అందిన వెంటనే తనిఖీలు నిర్వహించి అట్టివారిని చట్టపరకారం శిక్షించడం జరుగుతుందని ఆమె అన్నారు. చిన్నారులు అభ్యసించుటకు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సినదిగా ఆమె తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆమె అన్నారు.
కార్మిక శాఖ సహాయ కార్మిక కమీషనర్ బి ఎస్ ఎం వలీ మాట్లాడుతూ, నేడు సమాజంలో వెట్టి చాకిరీ కార్మిక వ్యవస్థ ఉందని, దీనిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందన్నారు. కార్మిక చట్టాలను అవగాహన చేసుకొవాలని, ఎట్టి పరిస్థితుల్లో వెట్టి చాకిరీ వ్యవస్థను అరికట్టాలని కోరారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కే. విజయ కుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి , జిల్లా ప్రజా రవాణా అధికారి కే షెర్మిలా అశోక్, తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా వెట్టి చాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
Prajavartha Online Telugu News