Breaking News

ఫిబ్రవరి 9, 10, 11 గుణదల మేరీమాత ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుణదల మేరీ మాత మహోత్సవములు ఫిబ్రవరి 9, 10, 11 మూడు రోజులు పాటు జరిగే గుణదల మాత వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నామని విజయవాడ పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. శుక్రవారం గుణదల సోషల్ సర్వీస్ సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ కెదలిక్ పీఠం బిషఫ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ ఈ నూరు వసంతాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామని ఫిబ్రవరి 8వ తారికు వరకు నవదిన ప్రార్థనలు, ప్రతి రోజు దివ్యసమిష్టి పూజబలి అనంతరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని. ఈ మహోత్సవాలకు కర్నూలు, ఖమ్మం, నల్గొండ పీఠాధిపతులు ముఖ్యఅతిథిలుగా పాల్గొంటారని అన్నారు. ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రజలు మేరీ మాతకు మొక్కులు తీర్చుకున్నారని చరిత్ర చెపుతుందని, కొబ్బరికాయలు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం హృదయ ఆర్పణకు సాదృశ్యం అని మేరీ మాతను దర్శించుకొని మాత కృప పొందాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వారు జిల్లా కలెక్టర్ మాకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముందుగా శ్రీ మాత మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. గుణదల కొండ ప్రాంతాన్ని, మేరీ మాత పుణ్య క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ కెదలిక్ పీఠం బిషఫ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఫాథర్ మువ్వల ప్రసాద్, ఫాదర్ యొలేటి విలియమ్ జయరాజు స్వామి ఫాదర్ సునీల్ రాజు తదితర గురువులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *