Breaking News

అంబాపురం సర్పంచ్ కబ్జా కోరల నుంచి నా స్థలాన్ని కాపాడండి రిటైర్డ్ ఆఫీసర్ పుల్ల జకరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హై కోర్ట్ తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అంబాపురం గ్రామపంచాయితీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కబ్జా కొరల నుండి నన్ను కాపాడాలని కమర్షియల్ టాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జకరయ్య ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎస్ నెంబర్ 96 /2 లో వున్నా స్థలాన్ని 2024 లో కొనుగోలు చేశామని చెప్పారు. తమ స్థలం పక్కనే వున్నా ఖాళీ స్థలంలో తమ స్థలాన్ని కలుపుకొని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అన్నారు. హై కోర్ట్ ఆర్డర్స్ ను ధిక్కరించి స్థానిక ఎమ్మెల్యే అండదండలతో సర్పంచ్ సీతయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు తమ పై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు అన్ని ఒరిజినల్ అని, ఇది పూర్తిగా ప్రైవేట్ ఆస్థి అని స్పష్టం చేశారు. దయచేసి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *