గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 5 వేల చదరపు అడుగులు కల్గిన భవనాలు కల్గి, ఐటి కంపెనీలకు అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి కల్గిన భవన యజమానులు ఈ నెల 10వ తేదీ నుండి కమిషనర్ చాంబర్లో సంప్రదించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పారిశ్రామికంగా, ఐటి పరంగా పలు సంస్థలను ఆహ్వానిస్తుందని, అందులో భాగంగా గుంటూరు జిల్లా కేంద్రంలో కార్యాలయాల కోసం ప్రత్యేకంగా భవనాలు అవసరమన్నారు. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆసక్తి కల్గిన భవన యజమానులు తమ భవనానికి సంబందించిన చిరునామా, అంతస్తుల వివరాలు, అద్దెకు ఇవ్వాలనుకున్న భవన విస్తీర్ణం, భవనం నిర్మాణం జరిగిన ఏడాది, యజమాని పేరు, ఫోన్ నంబర్, విద్యుత్, నీటి సదుపాయాల సమగ్ర వివరాలతో కమిషనర్ చాంబర్ లో సిటి ప్లానర్ డి.రాంబాబు (9849908390), చాంబర్ సూపరిండెంట్ ఎస్ఎన్ ప్రసాద్ (9866337509)కు అందించాలని కోరారు. ఆమోదించిన భవనాలకు ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాల మేరకు అద్దె చెల్లింపు జరుగుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News