Breaking News

వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదేళ్లలో 30 శాతం వృద్ది రేటు లక్ష్యం

-రాష్ట్ర దశ దిశను మార్చే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి
-రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న ఐదేళ్లలో 30 శాతం వృద్ది రేటు సాధన లక్ష్యంగా పటిష్టమైన చర్యలను చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రాధమికి రంగంలో 15.86 శాతం వృద్ది రేటు ఉందని, దీన్ని తొలి దశలో 20 శాతానికి తదుపరి రానున్న ఐదేళ్లలో 30 శాతానికి పెంచేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్థేశించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేడు రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగిందని, ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ది రేటును సాదించే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ది సాదించేందుకై వ్యవసాయ, హార్టీ కల్చర్, పశుసంవర్థకం, ఆక్వా కల్చర్ తదతర అంశాలపై వర్కు షాపు నిర్వహించి స్టేక్ హోర్డర్లు అభిప్రాయాలను తీసుకుని అందుకు అనుగుణంగా ఆయా రంగాల అభివృద్దికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో 18 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని, వాటి ద్వారా దాదాపు 1.52 లక్షల కోట్ల స్థూల విలువ ఆధారిత (GVA) ఆదాయం వస్తుందన్నారు. అయితే ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయ పంటలు 52 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుందని, దాని ద్వారా కేవలం రూ.57 వేల కోట్లు జివిఏ రాష్ట్రానికి వస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాను హార్టీ కల్చర్ హబ్ గా అభివృద్ది చేసే విధంగా పైలెట్ ప్రాజక్టు అమలు చేయడం జరుగుతున్నదని, దశల వారీగా అన్ని జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అందుకై ఉద్యాన పంటల సాగులో పెద్ద ఎత్తున ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులు వినియోగించుకోవాలన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు . ఉద్యాన వన పంటల సాగులో ఇప్పటి వరకూ దాదాపు రూ.40 కోట్ల మేర ఎన్.ఆర్.జి.ఎస్. నిధులను వినియోగించుకోవడం జరుగుతున్నది, దాన్ని రూ.200 కోట్లకు పెంచాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. అదే విధంగా దాదాపు 50 వేల ఎకరాల్లో బిందునీటి సేధ్యం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చిరుధాన్యాలతో పాటు మర్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న పలు రకాల పంటల సాగును ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

రాష్ట్రంలో రైతులకు తగిన చేయూతను అందించేందుకు మరియు వ్యవసాయ రంగ సమగ్రాభివృద్దికి కేంద్ర ప్రకటించిన వ్యవసాయ బడ్జెట్ నుండి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటుమన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది మూడు వ్యవసాయ పంటలు సాగు చేసేలా నీరు అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకు అనుగుణంగా జూన్ లోనే నారుమళ్లు వేసే విధంగా నీరు అందజేస్తామని, అక్టోబరు నుండి 80 రోజుల పాటు రెండో పంట సాగు చేసే విధంగా తదుపరి మూడో పంటగా మొక్క జొన్న, నువ్వులు తదితర పంటలు పండించే విధంగా నీటిని అందజేసేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అంశాలపై పొలం పిస్తుంది కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాన కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై అన్ని ముఖ్యమైన పంటకు కనీస మద్దతు ధరను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకలోవడం జరుగుతుందన్నారు. ఇకపై సాయిల్ పరీక్షలు శత శాతం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆ పరీక్షలు ఆధారంగా సూక్ష్మపోషకాలను దాదాపు 50 నుండి 70 శాతం వరకు రాయితీపై అందజేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డ్వాక్రా సంఘాలను పశు గ్రాసం పెంచే విషయంలో ప్రోత్సహించండతో పాటు పాలు పితికే మిషన్లను కూడా వారికి అందజేసి వారి డ్యాక్రా మహిళల ఉపాధి అవకాశలను కూడా మెరుగు పర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుతుందని ఆయన తెలిపారు.

అదే విదంగా రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆక్వా సాగును క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయిందని, అందుకు లైసెన్సింగ్ విధాన్ని త్వరలోనే మల్లోకి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు .

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచిన నేపథ్యంలో వ్యవసాయ మరియు అనుబంద రంగాల యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎం.బి.బి.ఎస్. విద్యార్థులకు ప్రస్తుతం రూ.25 వేలు స్టైఫండ్ ఇస్తుండగా, వెటర్నరీ డాక్టర్లకు, వ్యవసాయ కోర్సులు చదివే విద్యార్థులు కేవలం రూ.7000/- మాత్రమే స్టైఫండ్ ఇవ్వడం జరుచున్నదన్నారు. అయితే ఆ స్టైఫండ్ ను రూ.7000/- నుండి రూ.10.500/- లకు, పిజి విద్యార్థులకు రూ.12,000/- లకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్ అఫిషియే స్పెషల్ సి.ఎస్. బి. రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం మ్యాన్యుఫాక్చరింగ్, సర్వీసు రంగాలు నిలద్రొక్కు కోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో వ్యవసాయఅనుబంధ రంగాల జి.వి.ఎస్. / జి.ఎస్.డి.పి. కంట్రిబ్యూషన్ పెద్ద ఎత్తున పెంచేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అందుకు మూడు గ్ర్రోత్ ఇంజన్లుగా హర్టీకల్చర్, అక్వా కల్చర్ మరియు లైవ్ స్టాక్ పరిగణలోకి తీసుకుని ఆయా రంగాల సమగ్రాభివృద్దికి తగు చర్యలు తీసుకోవడం జరుతుందని ఆయన తెలిపారు. ఇందుకై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోనునామన్నారు.

వ్యవసాయ కమినషర్ డల్లీరావు, ఫిషరీస్ శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *