Breaking News

నులిపురుగుల నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం

-నేడు(10న)1.12 కోట్ల మంది పిల్లలకు అల్బెండజాల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
-మాత్రలు అందుకోని వారికి ఈనెల 17న మరోసారి పంపిణీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 10వ తేదీ జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినం సందర్భంగా 1 నుండి 19 ఏళ్ల మధ్యవయస్సు గల చిన్నారులు, విద్యార్ధులకు అల్బెండజాల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జి. వీరపాండ్యన్ నేడొక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామని ,మాత్రల్ని జిల్లా లకు ఇప్పటికే అంజేశామని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన అవగాహనా ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు , కరపత్రాల్ని కూడా పంపించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారులు, విద్యార్ధుల్లో 34 శాతం మేర నులిపురుగుల వ్యాప్తి ఉందని చెప్పారు. ఈ వ్యాధి నిర్మూల కోసం 400 మిల్లీ గ్రాముల చప్పరించే అల్బెండజాల్ మాత్రల్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా రెండోళ్లకోసారి అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1.12 కోట్ల మంది చిన్నారులకు ఈ మాత్రల పంపిణీ లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అంగన్వాడీలలో నమోదు చేసుకున్న వారితో పాటు పాఠశాలలకు వెళ్ళని చిన్నారులకు కూడా ఈ మాత్రల్ని సోమవారం నాడు పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. సోమవారం నాడు మాత్రల్ని అందుకోని వారికి ఈ నెల 17వ తేదీన మాప్అప్ డే రోజున మాత్రల్ని అందజేస్తామన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు పిల్లలకు ఈ మాత్రల్ని అందజేస్తామన్నారు. ఇందుకు అవసరమైన రవాణా, ఇతర మౌలిక వసతులఏర్పాటు, మాత్రల లభ్యత, ఐఇసి మెటీరియల్, సురక్షితమైన తాగునీటి ఏర్పాట్ల కోసం ఆరోగ్యశాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు సమన్వయంతో ఏర్పాట్లు చేశారని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు బాధ్యత వహించేలా ఆదేశాలిచ్చామని తెలిపారు. మాత్రల్ని విస్త్రుత స్థాయిలో పంపిణీ చేసేందుకు వీలుగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి రవాణా వ్యవస్థల వద్ద ప్రత్యేక బూత్ లను ఏర్పాటు చేశామన్నారు. ఈ మాత్రల్ని తీసుకున్నాక బహిరంగ మూత్రవిసర్జన చేయకపోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్ల గురించి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు వైద్యాధికారులు, స్వతంత్ర పరిశీలకులు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. మాత్రల్ని వాడాక ఎవరైనా ప్రతికూల ప్రభావానికి గురైతే ఆరోగ్యకేంద్రాలు అప్రమత్తమై 108,104 వంటి అత్యవసర సేవల విభాగాలతో సిద్ధంగా వుంటాయన్నారు. చిన్నారుల సంక్షేమం, రాష్ట్ర ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యాలతో పాటు ప్రజలందరూ సహకరించాలని వీరపాండియన్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *