Breaking News

ఫ్రిడ్జ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఏడవ వార్షికోత్సవ వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ” సెంట్రల్ నియోజకవర్గంలోని  సింగ్ నగర్ లోని ఆహ్వాన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయవాడ ఏసీ మరియు ఫ్రిడ్జ్ టెక్నీషియన్ అసోసియేషన్ వారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించి మెడికల్ క్యాంప్ నిర్వహించడం అయినది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు పాల్గొని సభ్యులకు  శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ:- ఈ కాలంలో ఎయిర్ కండిషనర్ వినియోగాలు చాలా పెరిగిపోయినాయి అని గతంలో విండో ఏసి మాత్రమే అందుబాటులో ఉండేదని నేడు స్ప్లిట్ ఎయిర్ కండిషనర్, సెంట్రల్ ఎయిర్ కండిషనర్లు అధికం అయిపోయినాయని రోజుల్లో ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఎయిర్ కండిషనర్లు ఉంటున్నాయని, అటువంటి ఎయిర్ కండీషనర్స్ టెక్నీషియన్స్ ప్రజల నిత్యజీవితంలో ఒక భాగమైపోయారని, వీరి సేవలను అభినందించి భవిష్యత్తులో వీరికి ఎటువంటి సహకారం కావాలన్నా తాను ముందుంటానని, ఇదే రోజు అసోసియేషన్ సభ్యులకు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం చాలా సంతోషించదగ్గ అంశం అని ఈ సందర్భంగా బొండా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎయిర్ కండిషనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *