Breaking News

బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటు పడిన ఆదర్శప్రాయుడు దామోద‌రం సంజీవ‌య్య

-దామోదరం సంజీవయ్య 104 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి సత్యవేడు శాసన సభ్యులు కోనేటి ఆదిమూలంతో కలసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం:ఎంఎల్ఏ కోనేటి ఆదిమూలం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటు పడిన ఆదర్శప్రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  దామోద‌రం సంజీవ‌య్య అని, వారి సేవలు చిరస్మరణీయం అని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మరియు సత్యవేడు ఎంఎల్ఏ కోనేటి ఆదిమూలం సంయుక్తంగా పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించిన ఆం.ప్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి సత్యవేడు శాసన సభ్యులుతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య జయంతిని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌ప్ర‌ధ‌మ ద‌ళిత ముఖ్య‌మంత్రి దామోదరం సంజీవ‌య్య జాతికి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. యాభై సంవత్సరాల లోపు ఉన్నపుడే పలు కీలక ఉన్నత పదవులు అలంకరించారు అని అన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు దేశంలో కార్మిక‌శాఖ‌, విద్యాశాఖ‌లో ప‌లు సంస్క‌ర‌ణ‌లు చేసి, రూపొదించిన చ‌ట్టాలు వివిధ వ‌ర్గాల‌కు ఎన‌లేని మేలు చేశాయ‌ని చెప్పారు. చిన్న వయసులోనే పేద ప్రజల జీవితాలపై అవగాహన కలిగి వారి ఉన్నతికి కృషి చేశారని తెలిపారు. నిరుపేద ద‌ళిత కుటుంబంలో పుట్టిన సంజీవ‌య్య త‌న అస‌మాన ప్ర‌తిభ‌తో ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగార‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ నీతికి, నిజాయితీకి, నిరాడంబ‌ర జీవితానికి మారుపేరుగా మారి ఆద‌ర్శ‌ప్రాయులుగా నిలిచార‌ని పేర్కొన్నారు. రాజకీయ రంగంలోనే కాకుండా, సామాజిక సంస్కరణలు, సాంస్కృతిక రచన రంగంలో మంచి ప్రతిభ పాటవాలు కలిగినవారని తెలిపారు. సంక్షేమం మరియు అభివృద్ధి సమ పాళ్లలో అమలు కావాలని ఆ కాలంలోనే ఆయన నమ్మేవారని, అందుకే వారు చేపట్టిన మంత్రిత్వ శాఖలలో పరిశ్రమలు, కార్మిక రంగ అభివృద్ధికి కృషి చేశారు అని కొనియాడారు. మంచి విజన్ కలిగిన గొప్ప నాయకుడు ఆదర్షనీయుడు అని పేర్కొన్నారు.

సత్యవేడు శాసనసభ్యులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగిన మహా నాయకుడు అత్యున్న‌త వ్య‌క్తిత్వం, ఉన్న‌త విలువ‌లు కలిగిన నాయకుడు దామోద‌రం సంజీవ‌య్య అని అందరికి ఆద‌ర్శ‌ప్రాయుల‌ని కొనియాడారు.

జెసి శుభం బన్సల్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య గారు చిరస్మరణీయులు మరియు ఆదర్షనీయులు అని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో అడిషనల్ ఎస్పి రవి మనోహరాచారి, సాంఘిక సంక్షేమ‌ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డివిఎంసి సభ్యులు, సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *