-ప్రభుత్వం అందించే బిందు సేద్య రాయితీ ప్రోత్సాహాన్ని జిల్లాలోనీ రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి
-సేంద్రియ పద్ధతి తో మామిడి పంట సాగు చేసి మంచి దిగుబడిని సాధించాలి
-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
చిన్న గొట్టుగల్లు, ఎర్రావారిపాలెం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అందించే బిందు సేద్య రాయితీ ప్రోత్సాహాన్ని జిల్లాలోని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం చిన్న గొట్టిగల్లు మండలం, ఎర్రవారిపాలెం లోని ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న సీసీ రోడ్లు, బిందు సేద్యo ద్వారా సాగు చేస్తున్న మామిడి, బొప్పాయి పంట సాగు విధానాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భాకరాపేట పంచాయతీ లోని ఎన్టీఆర్ కాలనీ సిసి రోడ్లును, అనిమల్ షెడ్స్, ఎర్రవారిపాలెం మండలం లోని పులుపుత్ర వారిపల్లె లోని సిసి రోడ్డు, ఫాగ్ హౌస్ నిర్మాణాలను పరిశీలించారు.
అనంతరం శ్రీనివాసులు అనే రైతుకు చెందిన మామిడి పంట సాగును పరిశీలించి క్రిమి సంహారక మందులతో కాకుండా సేంద్రీయ పద్ధతిలో మామిడి పంట దిగుబడి పెంచేలా సాగు ఉండాలని తెలిపారు.
చిన్నగొట్టుగల్లుకు చెందిన నరసింహులు అనే రైతు సాగు చేసిన మామిడి పంటకు (భూగర్బ జలాలను నీరు నిల్వ) నీటి సదుపాయం లో బాగంగా ఉపాథి హామీ పథకం కింద బౌండర్ ట్రెంచేస్ విధానంను గురించి రైతును అడిగి తెలుసుకొన్నారు. బౌండర్ ట్రెంచేస్ విధానం వలన రైతులకు నీటిని ఆదా చేసుకొని సౌకర్యo కలదని, ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేబడుతున్నామని డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు.
విజయకుమార్ అనే రైతు బిందు సేద్యo పద్ధతిలో సాగు చేస్తున్న బొప్పాయి పంటను పరిశీలించి ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నారని తెలుసుకొని ఇంకా మంచి ఫలితాలు సాధించేలా సాగు చేయాలని సూచించారు. బొప్పాయి పంటకు 1 హెక్టారుకు రూ. 24 వేలు, హెక్టారుకు మల్చింగ్ చేయడం కోసం 16 వేలు రాయితీ సదుపాయాన్ని ప్రతి రైతుకు ఇస్తున్నామని ఉద్యాన శాఖ అధికారి దశరథ రామి రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.
షేక్ రహమత్ అనే రైతు లూప్ పద్ధతి తో బిందు సేద్య చేస్తున్న మామిడి పంటను ను పరిశీలించారు. లూప్ పద్ధతి బిందు సేద్య కింద రైతులకు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు 90 శాతం రాయితీ 5 ఎకరాలు కన్నా ఎక్కువగా ఉన్న రైతులకు 70 రాయితీ బిందు పరికరాన్ని రాయితీ ఇస్తున్నట్లు ఏపీఎంఐపి అధికారి సతీష్ జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగింది. లూప్ పద్ధతి తో సాగు చేస్తున్న రైతును జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మల్చింగ్ పద్ధతిలో టమోటా పంట సాగు,ప్యాక్ హౌస్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దారులు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News