విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మై భారత్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అనే అంశంపై ఈరోజు నెహ్రూ యువ కేంద్ర విజయవాడ ఆఫీస్ లో జిల్లా యువ అధికారి సమక్షంలో కమిటీ మీటింగ్ జరిగింది, మై భారత్ ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశం అని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము అన్నారు. మై భారత్ ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమం ఏర్పాట్లపై శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ అధికారులతో కలిసి కమిటీ మీటింగ్ నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ వ్యవసాయ, నాబార్డ్, లీడ్ బ్యాంకు,డి ఐసి, కెవికె డిపార్టుమెంట్లను ముందుగా మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి, ఆయా శాఖల ద్వారా కనీసం 20 మంది యువతకు 120 గంటలు మై భారత్ ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మై భారత్ ఎక్స్ పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం సంబంధించిన ప్రతులను సమీక్షలో పాల్గొన్న అధికారులకు అందజేశారు ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయాధికారి విజయ కుమారి, లీడ్ బ్యాంకు ఎ ఎల్ డి యమ్ హెచ్ రమేష్, కె వి ఐ సి అసిస్టెంట్ డైరెక్టర్ వి కోటిరెడ్డి, డిఐసి జనరల్ మేనేజర్ బి సాంబయ్య, డిస్టిక్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కొల్లేటి రమేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె వి కె అచ్యుత రాజు, ఎస్ ఆర్ ఆర్ సి వి ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి ఏబీఎన్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News