Breaking News

రాబోవు వేసవి కాలం దృష్ట్యా నీరు వృధా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి  పిలుపు మేరకు మూడో శనివారం ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బందితో కలిసి నిర్వహించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఫిబ్రవరి నెల సోర్సు- రిసోర్సు థీమ్ లో భాగంగా రాబోవు వేసవి కాలం దృష్ట్యా నీరు వృధా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ బాటిల్స్ లో త్రాగి వదిలేసే మిగిలిన నీటిని వృధాగా పారబోయకుండా వాటిని మొక్కలకు అందించారు. ఇందులో భాగంగా విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయ ప్రాంగణం, పరిసరాల పరిశుభ్రం చేశారు. చెత్త నిల్వలను శుభ్రపరచి , తిరిగి ఆప్రదేశంలో వ్యర్దాలు వేయకుండా మొక్కలు పెంపకం నిర్వహించాలన్నారు.

తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడం, పేపర్లు, కంప్యూటర్ వేస్టేజ్ రీయూజ్ పై సూచలు ఇచ్చారు. భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం,ఇదే సంప్రదాయాన్ని మునుముందు వారు కొనసాగించడానికి స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *