Breaking News

పోరాటాల కోసం కాదు.. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కె.బి.ఎన్. కాలేజీలో ఉపాధ్యాయుల‌తో స‌మావేశం
-ఉపాధ్యాయులకి ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేసిన ఎంపీ
-గ‌త ప్ర‌భుత్వ విధానాల‌ను ధైర్యంగా వ్య‌తిరేకించింది ఉపాద్యాయులే
-ఆలపాటి కి మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన ఎన్డీయే కూట‌మి నాయ‌కులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స‌మాజానికి ప్ర‌తిభావంతులైన ప‌ట్టుభ‌ద్ర‌లను అందించే మేధా సంప‌త్తి క‌లిగిన ఉపాధ్యాయులు, లెక్చ‌ర్స్ ఈ నెల 27న జ‌రిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోరాటాల కోసం కాకుండా, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూట‌మి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరారు.

కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) శ‌నివారం కె.బి.ఎన్ కాలేజీ లో ఉపాధ్యాయుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.అనంతరం తొలి ప్రాధాన్యత ఓటు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి వేసి గెలిపించాలంటూ ఉపాధ్యాయులకి ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే కె.బి.ఎన్. కాలేజీ క్యాంటీన్ లో ఉపాద్యాయుల‌తో క‌లిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ టీ తాగారు.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వాన్ని గెలిపించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.గ‌త ప్ర‌భుత్వ దుర్మార్గాన్ని ధైర్యంగా ఎదిరించి రోడ్ల‌పైకి వ‌చ్చి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపింది ఉపాద్యాయులే అన్నారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి పిల్ల‌లకు విద్య‌నందించే విద్యా సంస్థ‌ల‌కు అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాన‌న్నారు. యువ‌త భ‌విష్య‌త్తు బాగుండాలంటే విద్య చాలా అవ‌స‌రం.విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వర్గంలో అందుబాటులో ఫీజులు పెట్టి నాణ్య‌మైన విద్య‌ను కెబిఎన్ కాలేజీ యాజ‌మాన్యం అందిస్తుంద‌న్నారు. ఈ సంస్థ ఈ విధంగా అభివృద్ది చెంద‌టానికి ముఖ్య భూమిక ఉపాధ్యాయుల‌దేనంటూ వారిని కొనియాడారు. రాష్ట్ర భ‌విష్య‌త్తు గురించి ఆలోచించాల‌ని కోరారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చంద్ర‌బాబు యువ‌త‌కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టార‌ని తెలిపారు.

సీఎంచంద్ర‌బాబు నాయుడు ఒక వైపు సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూనే రాష్ట్రాభివృద్ది చేస్తున్నార‌ని, ఇక మే ,జూన్ నెల నుంచి రైతు భ‌రోసా, త‌ల్లి వంద‌నం, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాలు అమ‌లు కాబోతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి ప‌క్షంలో వున్న‌ప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడామని అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్.కె.పి.వి.వి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఎ.వో డాక్ట‌ర్ వి.నారాయ‌ణ రావు, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న‌, టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా , స‌య్య‌ద్ ర‌ఫీ, జిల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సొలంకి రాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి ఎమ్.ఎస్.బేగ్, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌ద‌ర్శి కొట్టేటి హ‌నుమంతురావు, కొర్పొరేట‌ర్లు ఉమ్మ‌డి చంటి, అప్పాజీ, రాజేష్ లతో పాటు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ టిడిపి, బిజెపి, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *