విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ‘గౌరీపూజ స్టోర్స్’ యాప్ ప్రారంభించబడిరది. సోమవారం గాంధీనగర్‌లోని శ్రీ కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల, విజయవాడ బ్రాంచ్ నందు దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణుభట్ల పద్మావతి యాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘గౌరీ పూజ స్టోర్’ వ్యవస్థాపకులు దివాకరుని మృత్యుంజయ శర్మను అభినందించారు. భక్తునికి దేవునికి అనుసంధానం చేసే విధంగా పూజా సామాగ్రిని ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా హోమ్‌డెలివరీ చేసే ఆలోచన ఒక మంచి సదావకాశమని తెలిపారు. ఇప్పటికి సాంకేతిక విధానంలో ఎన్నో వున్నా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ‘గౌరీపూజ స్టోర్స్’కి కలగాలని, ఈ విధానం ద్వారా వ్యాపారరంగంలో దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. గౌరీ పూజ స్టోర్ వ్యవస్థాపకులు దివాకరుని మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రజలకు ఇది ఒక శుభవార్త. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి పూజ సామాగ్రి యాప్ ఈ గౌరీపూజ స్టోర్స్ (gowripujastores). ఈ యాప్‌ను ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా వైదికపరమైన కార్యక్రమాలకు సత్యనారాయణస్వామి వ్రతం, వివాహం, ఉపనయనం, శంకుస్థాపన, గృహప్రవేశం, లక్షవత్తి వ్రతం, షష్టిపూర్తి, విగ్రహప్రతిష్ఠలకు, శాంతి హోమములకు, యజ్ఞ యాగాదులకు, సమస్త సామాగ్రిని హోమ్ డెలివరీ చేయబడునన్నారు. ప్రత్యేకంగా రుద్రాక్షలు, స్పటికమాలలు, స్పటిక లింగాలు, స్పటిక బాణములు, మరకత లింగాలు, మరకత బాణాలు, మహా లింగార్చనకు అవసరమైన నర్మదా బాణాలు, స్పటికాలు, ఇత్తడి సామాన్లు మా వద్ద లభించును. లక్ష పసుపు కొమ్ముల వ్రతం, కైలాసగౌరి నోములకు పనుపు, కుంకుమ స్వచ్ఛమైనది లభించునన్నారు. ఉదాహరణకు గృహప్రవేశానికి, శంఖుస్థాపనకు వాడే నవధాన్యాలు, శంఖువు చంద్రకర్ర, పాలకర్రతో చేసినవి ఎలా వుండాలో ఎంత ప్రమాణంలో వుండాలో పండితులను సూచనల మేరకు కనుక్కొని అన్ని రకాలు పూజాసామాగ్రి వస్తువులు, క్వాలిటీతో, కావలసిన పరిమాణంలో అందజేయడమే మా ప్రత్యేకత అని తెలిపారు. అలాగే అధ్యాత్మిక పుస్తకాలు, పూజా, నోములకు సంబంధించిన తదితర పుస్తకాలు లభించే ఆధ్యాత్మిక వస్తు నిలయమన్నారు. 24/7 ఫోన్‌నెంబర్‌లో 7382471011 అందుబాటులో వుంటామన్నారు.
Prajavartha Online Telugu News