Breaking News

కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం

-సినిమా షూటింగులకు కొండవీటికోట చాలా అనుకూల ప్రదేశం
-చిత్రపరిశ్రమ ఏపీకి కూడా రావాలని కోరుతున్నాము
-పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త :
కొండవీటికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కొండవీటికోట ప్రాంతం సినిమా షూటింగులకు అనువైన ప్రదేశమని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీటి కోటను చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు చంద్రబాబు నాయుడు రూ.40 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. దీంతో కోటపైకి రోడ్డు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రానున్న కాలంలో కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరం అయితే పర్యటకశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో కొండవీటికోటపై హీరో శివాజీ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కు మంత్రి హాజరయ్యారు. పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్ జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కే పరిమితం అయిన సినిమా ఇండస్ట్రీని, ఏపీకి కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *