Breaking News

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు భూసేకరణ, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

-జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోజాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు,నిర్మాణ పురోగతి పనులపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పి డి లు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు, కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తాసిల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న కడప – రేణిగుంట , తిరుపతి – మదనపల్లి , రేణిగుంట – నాయుడుపేట ఆరు లైన్లు రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారుల పనులు పూర్తి చేయాలని భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనిసూచించారు.భూసేకరణ పెండింగ్ అవార్డులు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలిపారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకొని పనులు పూర్తి కావాలని అన్నారు. రైల్వే లైన్ లో భాగంగా భూ సేకరణకు సంబంధించిన పనులును సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఏపీఐఐసీ జెడ్ ఎం విజమ్ భరత్ రెడ్డి, నేషనల్ హైవే పి డి లు తిరుపతి వెంకటేష్,నెల్లూరు ఎంకే చౌదరి, చెన్నై రవీంద్రరావు, డెప్యూటీ తాసిల్దార్ భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *