గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు జూటూరి వెంకటేశ్వర రావు, బంగారు సింహాద్రి ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ లను బుధవారం కమిషనర్ ఛాంబర్ నందు అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ఇటీవల ప్రజారోగ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు జూటూరి వెంకటేశ్వర రావు, బంగారు సింహాద్రి లు మరణించారని, వారి కుటుంబ సభ్యులకు సాధారణ మరణానికి అందే ఎక్స్ గ్రేషియా మరియు మట్టి ఖార్చుల క్రింద రూ.2 లక్షల చెక్కు లని అందించామని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు, పి.ఎఫ్. కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగాధిపతులను, సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు. కార్మికులు కూడా తమ సమస్యల పై అర్జీలు లేదా ఫిర్యాదులు తమకు అందిచవచ్చని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Prajavartha Online Telugu News