-ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వీరుళ్లపాడు మండలం, గూడెం మాధవరం ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) మన్నే సుధీర్ సస్పెన్షన్‌కు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం ఆదేశాలిచ్చారు. గ్రామంలో వేతనదారులకు పనులు కల్పించడంలోనూ సగటు వేతనం విషయంలో జిల్లాలోనే అట్టడుగు స్థానంలో నిలిచినందున, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు, సమావేశాలకు హాజరుకానందున క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ ఆదేశాలిచ్చారు. ఈ విషయమై సుధీర్‌కు నోటీసులు కూడా జారీఅయ్యాయి.
Prajavartha Online Telugu News