Breaking News

దేవాలయనగరి తిరుపతిలో ఐఎంపీసీసీ సమావేశాన్ని నిర్వహించిన పీఐబీ విజయవాడ విభాగం

-తప్పుడు వార్తలు లేదా తప్పుదారి పట్టించే సమాచారానికి సంబంధించిన ఏ సంఘటనల సందర్భంలోనైనా సమష్టి ప్రయత్నాల ద్వారా తక్షణ ప్రతిస్పందనల కోసం, తద్వారా మన్నికైన సమాచార ప్రసారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నాము – ఎడిజి పీఐబీ రాజీందర్ చౌదరి
-వేవ్స్ 2025, 2025-26 బడ్జెట్‌లో ముఖ్యమైన ప్రకటనలు, అరకు కాఫీ బ్రాండింగ్ ప్రయత్నాలు, ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ వ్యవసాయం సామర్థ్యంపై సమాచార వ్యాప్తిపై సమావేశంలో జరిగిన చర్చలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయనగరి ఐన తిరుపతిలో రాష్ట్రీయసేవాసమితి భవనంలో ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (ఐఎంపీసీసీ) సమావేశం జరిగింది. పత్రికా సమాచార కార్యాలయం – ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి పీఐబీ ఏపీ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్ (రీజియన్) రాజీందర్ చౌదరి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజీందర్ చౌదరి, మెరుగైన సమన్వయం మరియు సమాచార పంపిణీ కోసం ప్రభుత్వం కింద ఉన్న వివిధ సంస్థలకు వేదికను అందించడానికి, అలాగే సంక్షోభ కారక , అసమంజస సమాచార ప్రసార సందర్భాలను పరిష్కరించడానికి, ఇంకా ప్రతికూల వార్తలను నియంత్రించే దిశలో సాధనంగా ఐఎంపీసీసీ సమావేశం ఏర్పాటు అయ్యిందని అన్నారు. కేంద్ర , రాష్ట్ర మీడియా విభాగాల , ప్రభుత్వ రంగ విభాగాలైన పీఎస్‌యూల వంటి ప్రతి సంస్థలో చేపడుతున్న వివిధ పద్దతులు, ప్రయత్నాలని హైలైట్ చేయడం కూడా ఈ సమావేశం లక్ష్యం. మంచి ప్రజా సంబంధాల అనుసంధాన వ్యవస్థ ను అభివృద్ధి చేయడంపై నొక్కి చెబుతూ, మెరుగైన మీడియా ఏకీకరణ, సమన్వయం ఖచ్చితంగా కోరుకున్న ఫలితాలను సాధిస్తుందని ఆయన అన్నారు.

విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయం- ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్ , సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఏపీ ప్రాంతీయ విభాగం నిర్వహించే పాత్ర, విధులను చౌదరి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, ప్రత్యేక సాధనలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని అందించే బాధ్యత వీరిదని తెలిపారు. పీఐబీ ప్రభుత్వానికి మీడియాకు మధ్య వారధిగా, ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుందని, అలాగే మీడియాలో ప్రతిబింబించిన ప్రజల ప్రతిస్పందనపై ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడానికి కూడా సేవలందిస్తుందని ఆయన అన్నారు.

రాబోయే వేవ్స్ 2025, 2025-26 బడ్జెట్‌లో ముఖ్యమైన ప్రకటనలు, అరకు కాఫీ బ్రాండింగ్ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ వ్యవసాయం సామర్థ్యంపై సమాచార వ్యాప్తిని సమగ్రంగా పెంచాలని మీడియా , ఇంకా ప్రజా సంబంధాల విభాగాలను నిర్వహిస్తున్న అన్ని శాఖలకు ఆయన సూచించారు.

స్థానిక, కేంద్ర మీడియా యూనిట్ల అధిపతులు , ప్రతినిధులు, ఆకాశవాణి, ఐఐటి తిరుపతి, జాతీయ సంస్కృత యూనివర్సిటీ, ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఏఆర్‌ఎల్, ఐఐఎస్‌ఈఆర్, పాస్‌పోర్ట్ విభాగం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దక్షిణ మధ్య రైల్వే, ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్ మొదలైన సంస్థల ప్రతినిధులు ఐఎంపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *