Breaking News

ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక…

-జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక : కలెక్టర్ మరియు జిల్లా డివిఎంసి కమిటీ చైర్మన్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేందుకు ఈ డివిఎంసి కమిటీ సమావేశం ఒక వేదిక అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు తో కలసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలపై నివేదికలను కమిటీ సభ్యులకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు, వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేందుకు సమావేశవేదిక ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని తెలిపారు. గూడూరు నందు గల అంబేద్కర్ భవన్ ను పరిశీలించి మరమత్తులు చేయుటకు తగిన చర్యలు తీసుకోవలసినదిగా సూచిస్తూ, ప్రతి రెవెన్యు డివిజన్ ప్రధాన కార్యస్థానంలో మరియు ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయవలసినదిగా సంబందిత రెవెన్యు డివిజన్ అధికారులను ఆదేశించారు. అన్ని సాంఘికసంక్షేమ వసతి గృహాలు, వెనకబడిన వసతి గృహాలను తనిఖీ చేసి పూర్తిగా దెబ్బతిన్న భవనములను తొలగించి కొత్త భవనములు నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. చిన్న చిన్న రేపేరు ఉన్న భవనములను గుర్తించి మరమత్తులు చేయవలసినదిగా ఆదేశించారు. అలాగే స్వచ్చ భారత్ లో భాగంగా వసతి గృహాల నందు మరుగుదొడ్లు ఏర్పాటు చేయుటకు తగిన ప్రతిపాదనలు తయారు చేసి పంపవలసినదిగా తెలిపారు.
జిల్లా ఎస్.పి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తామని, జిల్లాలో గతంలో జరిగిన వారికి న్యాయం చేకూరుస్తామని తెలిపారు. ఎస్.సి, ఎస్.టి అట్రాసిటి కేసులు నమోదు అయినప్పుడు అప్పటికప్పుడే స్పందించి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి శిక్షలు పడే విధంగా చేస్తున్నామని, అలాగే ఎప్పుడు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు కక్ష్యలతో తప్పుడు కేసులు బనాయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సభ్యులు సూచిస్తూ బ్యాంకులలో ఎస్సీ ఎస్టీ లకు వ్యక్తిగత రుణాలు మంజూరు, తదితర రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని, స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని, పొలాలకు వెళ్ళుటకు దారులు కల్పించాలని గూడూరు పట్టణం గాంధీ నగర్ నందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వ పథకాలు, న్యాయపరమైన అంశాలను వాgరికి అందేలా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. స్మశాన వాటికలు లేని గ్రామాలలో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. అనంతరం బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అనే పోస్టర్లను అధికారులు, సంఘ సభ్యులతో కలిసి విడుదల చేసారు.

ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ నరసింహులు, ఆర్డీవోలు తిరుపతి, కాళహస్తి మరియు సూళ్ళూరుపేట రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డి పి ఓ శ్రీమతి సుశీల దేవి, డి ఆర్ డి ఏ పిడి శోభన్ బాబు, డ్వామా పిడి శ్రీనివాసప్రసాద్, డి ఈ ఓ కుమార్, తిరుపతి, పుత్తూరు, కాళహస్తి, గూడూరు సూళ్లూరుపేట డిఎస్పీలు, జిల్లా అధికారులు, నూతనగంగా ఎంపిక కాబడిన సంఘ నాయకులు ఎస్.సి, ఎస్.టి తెగలకు చెందిన సభ్యులు శ్రీమతి సరస్వతమ్మ, శ్రీ అరవ పార్వతయ్య, పునబాకం వలముని, యేసిపాక పెంచలయ్య స్వచ్చంద సేవా సంస్థల నుండి శ్రీ వెంకటరమణ, సయ్యద్ తాజుద్దీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *