Breaking News

ఏపీసీఎనీఎఫ్ తో కలిసి పనిచేస్తాం

-ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రశంసించిన జర్మన్ బృంద ప్రతినిధులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్న ,సన్నకారు రైతులు కూడా వాతావరణ మార్పులకు దోహద పడతారని, ప్రకృతి వ్యవసాయంలో మహిళలు మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని జర్మన్ ప్రతినిధులు ప్రశంసించారు. గత మూడు రోజులుగా ఆంద్ర ప్రదేశ్ లోని గుంటూరు,కృష్ణా,ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలలో రైతు సాధికార సంస్థ “ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం(ఏపీసీఎన్ఎఫ్)” ద్వారా అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ రోజు శుక్రవారం 21 వ తేదిన విజయవాడ లోని ఒక ప్రవేట్ హోటల్ లో ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న మెంటార్ మరియు ఫార్మర్ సైంటిస్ట్ లతో సమావేశమై కోర్సు విధి విధానాలను తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ లు సుధాకర్,జాకీర్ హుసేన్ మాట్లాడుతూ మెంటార్ లు తమ పొలంలో ప్రకృతి విధానాలను అవలంభిస్తూ ఫార్మర్ సైంటిస్ట్ లకు శిక్షణలు అందిస్తారని, 4 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేస్తారని ప్రతినిధి బృందానికి వివరించారు. ఫార్మర్ సైంటిస్ట్ లు కూడా తప్పకుండ తమ సొంత పొలంలో ఎ.టి.యం (ఎనీ టైం మనీ) , “ ఏ “ గ్రేడ్ విధానాలు అవలంభిస్తారని వివరించారు.
జర్మన్ బృంద సభ్యులుబెన్నెడిక్ట్ హెర్లిన్, జాస్పర్ జోర్డాన్, డియోగో కౌటినో, లూకస్ కేహ్లే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచంలో మొత్తం భూమిని మొత్తం జనాభాతో లెక్కిస్తే ఒక్కొక్కరికి అర ఎకరా భూమి వస్తుందని, ఆ విస్తీర్ణంలో ఏక పంట విధానం అవలంబించడం వలన ఆహార కొరత ఏర్పడుతుందని అన్నారు. అందుకు పరిష్కార మార్గంగా “ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్”తరపున అన్ని దేశాలలో “2000 చదరపు మీటర్ల” మోడల్ ను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో “ఎ పి సి ఎన్ ఎఫ్” అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విదానాలను అధ్యయనం చేశామని, ప్రస్తుతం “ఎ పి సి ఎన్ ఎఫ్ చేస్తున్న” విధానాలలో అనేక మార్పులు సాధించారని కొనియాడారు. ప్రపంచం మొత్తంలో 60 దేశాలలో 500 మంది సైంటిస్టు లతో పనిచేస్తున్నామని, అందులో భారత దేశం కూడా ఒక బాగమన్నారు.ముఖ్యంగా రసాయన వ్యవసాయంలో అధిక దిగుబడులు వస్తున్నా ఆకలి చావులు ఉన్నాయన్నారు.800 మిలియన్ ప్రజలకు పౌష్టిక ఆహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 2 మిలియన్ల జనాభాకు పోషక లోపాల ఆహారం కూడా అందడం లేదని, మరో వైపు 3 బిలియన్ల ప్రజలు అధిక ఆహారం తీసుకొని ఊబకాయంతో భాధ పడుతున్నారని తెలిపారు.
జర్మన్ దేశంలో వాతావరణం, నీరు కలుషితం అవుతున్నాయని , భూమిలో వున్న సూక్ష్మజీవులను మనం రసాయనాలతో ఇబ్బంది పెడితే మానవ శరీరంలో కూడా సూక్ష్మజీవులు నశిస్తాయన్నారు. సూక్ష్మజీవులు వృద్ది చెందితే తప్ప నేల ఆరోగ్యం మెరుగుపడదని సూచించారు. మా“2000 చదరపు మెటర్ల మోడల్ ప్రాజెక్ట్” కు సారూప్యమైన వివిధ మోడల్ లను రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ అవలంభించే విధానాల ద్వారా తెలుసుకొన్నామని, ఈ దిశగా పయనించేందుకు “ఎ.పి.సి.ఎన్.ఎఫ్” తో భవిష్యత్ లో కలసి పని చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు ప్రకాష్ రావు, శ్రీనివాసులు, జి. శ్రీనివాస్ రావు ఏపీసీఎనీఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి విజయ కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *