భువనేశ్వర్, నేటి పత్రిక ప్రజావార్త :
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మోడిషా తో శనివారం సీఎం కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి వివిధ పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురి నేతల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి తమ శాఖ నుండి అవసరమైన సహకారం తప్పనిసరిగా అందజేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఒడిశా సీఎం మోహన్ మోడిషాకి హామి ఇచ్చారు.
Prajavartha Online Telugu News