Breaking News

ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు సజావుగా కొనసాగేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ , జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ప్రీసైడింగ్ అధికారులు కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన అన్ని ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు జరిగే ముందు రోజు 26-02-2025 తేదీన ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు ముందుగానే చేరుకొని ఏపీవోలు ఓపిఓలను సమన్వయం చేసుకొని ఎన్నికల సామాగ్రి స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు తీసుకొని వాటిని పూర్తిగా పరిశీలించుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 8 గంటల సమయానికి ఓటింగ్ ప్రారంభించేలా పోలింగ్ కేంద్రాల వద్ద నిర్దేశించిన విధంగా అభ్యర్థుల వివరాలు ఇతర పోస్టర్లు ప్రదర్శించాలని, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కు సిద్ధం చేయాలన్నారు. టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు కు సంబంధించి నిర్దేశించిన ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ సమయం ముగిసే నాటికి పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ స్లిప్పులిచ్చి ఓటింగ్ కు అవకాశం కల్పించాలన్నారు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పేపర్ల అకౌంట్, పీవో డిక్లరేషన్ ,పిఓ డైరీ ,పేపర్ సీల్స్ అకౌంట్ ఫారాలు పోలింగ్ కేంద్రాల్లోనే సక్రమంగా పూర్తి చేసుకొని,బ్యాలెట్ బాక్సులు పూర్తిస్థాయిలో సీల్డ్ వేసి రిసెప్షన్ సెంటర్లకు చేరుకోవాలన్నారు. . రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్లలో బ్యాలెట్ బాక్సులు, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాలు, ఇతర ఎన్నికల సామాగ్రి భద్రంగా అందించాలన్నారు. పిఓలు నిర్వర్తించాల్సిన విధులుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కు సిద్ధం చేసే విధానం పోలింగ్ ముగిసిన తర్వాత సీల్ చేసే విధానంపై ప్రాక్టికల్ గా శిక్షణ అందించారు.
సమావేశంలో ప్రిసైడింగ్ అధికారులు, , సెక్టార్ అధికారులుగా నియమించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *