Breaking News

పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్, కౌంటింగ్ కు పూర్తిస్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సాధారణ అబ్జర్వర్ వి. కరుణ కు వివరించారు.
శనివారం విజయవాడ నుంచి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సాధారణ అబ్జర్వర్ వి. కరుణ శాసన మండలి ఎన్నికలపై ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి ఎన్నికల అబ్జర్వర్ వి.కరుణ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారం పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి నియమించిన అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీకి సంబంధించి రూట్ ప్లాన్లు, బందోబస్తు ప్లాన్ పక్కాగా రూపొందించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ సమన్వయంతో అదనపు భద్రతను ఏర్పాటు చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరం నుంచి పాల్గొన్న రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ కేంద్రాల్లో విధులను కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులు, ఓ పి ఓ లు, రూట్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలించే మెటీరియల్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు. అక్కడ మూడంచెల పటిష్ట పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కు సంబంధించి మూడు షిఫ్టుల్లో ఓట్లు లెక్కించేలా ఉద్యోగులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు. అభ్యర్థులకు సైతం మూడు షిఫ్టుల్లో ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఎన్నికల ప్రచారాన్ని పోలింగ్ కు 48 గంటల ముందు 25-02-2025 తేది సాయంత్రం నాలుగు గంటలకు నిలిపివేసేలా అభ్యర్థులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలింగ్ రోజు 27-02-2025 ఉదయం 8 గంటలకి కచ్చితంగా పోలింగ్ ప్రారంభించేలా ఉదయం 7:45 గంటలకే బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిసైడింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికలు, కౌంటింగ్ పూర్తి పారదర్శకంగా, సజావుగా ప్రశాంత వాతావరణం కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లను, జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేయడం జరిగిందన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టరు ఏ భార్గవ్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఎన్నికల సెక్షన్ సూపర్డెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *