Breaking News

నూతన వధూవరులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెండో కుమార్తె లక్ష్మీ చంద్రిక, వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్ ల వివాహ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హాజరైన వారిలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఎండి రుహుల్లా, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మొండితోక జగన్మోహన్ రావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజా రెడ్డి, బెల్లం దుర్గా, వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *