గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ`గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామ ప్రసాద్ (రాజా) తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం గుంటూరు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్లబ్ నందు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు సోమవారం గుంటూరు, తెనాలి, నాగార్జునయూనివర్శిటీ, మంగళగిరి పరిసర ప్రాంతాలలో పర్యటనలో భాగంగా ఓటర్లను అభ్యర్థించినట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న తనను గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో తనను అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీరియల్ నెంబర్ 5కి మీ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అంకె వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గతంలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై ఆంధ్ర యూనివర్సిటీలో పలు పోరాటాలు చేసి విజయం సాధించానన్నారు. లా పూర్తి చేసి బెజవాడ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నానని, హనుమాన్ జంక్షన్‌లో ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. విద్యార్థి దశ నుండి విద్యార్థుల యొక్క సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని వారి సమస్యలు పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టబద్రుల సమస్యలను శాసనసభలో చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బేతాళ ప్రభాకరరావు తెనాలి బార్ ప్రెసిడెంట్, కాసు వెంకటరెడ్డి జిల్లా న్యాయవాద ఫెడరేషన్ సంఘం అధ్యక్షులు, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మేడా రమేష్ రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ, వాసు బిసి నాయకులు, బ్రహ్మారెడ్డి స్టేట్ బార్ కౌన్సిల్ నెంబర్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News