Breaking News

బ్యాలెట్ బాక్సుల పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన బ్యాలెట్ బాక్సులు , స్టాట్యుటరీ మరియు నాన్ స్టాట్యుటరీ ఫారాలతో కూడిన కిట్లను సోమవారం రాత్రి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి పరిశీలించారు. మెటీరీయల్ మేనేజ్మెంట్ మరియు బ్యాలెట్ బాక్సుల నోడల్ అధికారి అయిన జిల్లా పరిషత్ సిఇఓ జ్యోతిబసు ను బ్యాలెట్ బాక్సులకు సీరియల్ నెంబర్లు వేసి వాటిని పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్దపరచాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే పోలింగ్ నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా అందించాల్సిన స్టాట్యుటరీ మరియు నాన్ స్టాట్యుటరీ ఫారాల కిట్లను ఎలాంటి పొరపాట్లు లేకుండా సిద్దపరచాలన్నారు. స్థానిక ఏ. సి కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఫిబ్రవరి 26 వ తేది ఉదయం నుండి బ్యాలెట్ బాక్సులు , పోలింగ్ మెటీరీయల్ ను పోలింగ్ సిబ్బందికి అందించాల్సి వున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డిఆర్ఓ షేక్. ఖాజావలి , జెడ్పీ సిఇఓ జ్యోతిబసు, ఎలెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *