-జె. శ్రీనివాసరావు, విజయవాడ బాయిలర్ల తనిఖీ అధికారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల్లో ఏర్పాటయ్యే బాయిలర్ ల నిర్వహణా విధానాలు తీసుకోవాల్సిన భద్రతా చర్యల పై బాయిలర్ ఆపరేటర్లకు పునఃశ్చరణ తరగతులను భోదించడం జరిగిందని విజయవాడ బాయిలర్ల ఉప ముఖ్య తనిఖీ అధికారి విజయవాడ బాయిలర్ల తనిఖీ అధికారి జె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా బాయిలర్ల శాఖ ఆధ్వర్యంలో కృష్ణా మరియు యన్.టి.ఆర్. జిల్లా పరిసర ప్రాంతాల్లో పనిచేయుచున్న బాయిలర్ అటెండెన్స్ (ఆపరేటర్లు) పునఃశ్చరణ తరగతులను గాంధీనగర్ లో గల కృష్ణా జిల్లా రైస్ అండ్ ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ లో సోమవారం నిర్వహించామన్నారు. పరిశ్రమల్లో బాయిలర్ ల నిర్వహణా విధానాలు తీసుకోవాల్సిన భద్రతా చర్యల పై, బాయిలర్ల లో వాడే నీటి వినియోగం, శుద్ధి మొదలైన అంశాలపై సుదీర్ఘ అనుభవం గల పరిశ్రమ నిష్ణాతులచే బాయిలర్ లను ఆపరేట్ చేసే బాయిలర్ ఆపరేటర్లకు శిక్షణను అందించామన్నారు. ప్రతి ఏటా జరిగే ఇటువంటి తరగతులను గతంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ గుడివాడ, హనుమాన్ జంక్షన్ మరియు కొండపల్లిలో కూడా నిర్వహిచామన్నారు.
కార్యక్రమంలో విజయవాడ బాయిలర్ల ఉప ముఖ్య తనిఖీ అధికారి యం. సత్యనారాయణ తో పాటు జోసిల్ ఫ్యాక్టిరీకు చెందిన షేక్ రిషావత్ ఆలీ, రాజమండ్రి ఎ.పి. పేపరు మిల్లు టెక్నికల్ ఆఫీసర్ వి.వి.వి. సత్యనారాయణ, నవభారత్ లిమిటెడ్ కు చెందిన యస్. నందకేశవరావు, రామదాసు పేపర్ బోర్డ్స్ కు చెందిన కె.యస్. పవన్ నారాయణ, స్వతంత్ర కన్సల్టంట్ యమ్. ప్రసాద్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలను, సూచనలను అందించారు.
Prajavartha Online Telugu News