Breaking News

బడ్జెట్ సమావేశాల్లో కార్యదర్శులు అసెంబ్లీలో అందుబాటులో ఉండాలి

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బడ్జెట్ సమావేశాలు జరుగుచున్న సమయంలో అసెంబ్లీలో సంబందిత శాఖల కార్యదర్శులు తప్పని సరిగా అందుబాటులో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుచున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారని వాటిని కార్యదర్శులు అందురూ తప్పని సరిగా పాటించాలన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం సి.ఎస్. సమావేశ మందిరం నుండి అన్ని శాఖల కార్యదర్శులు, ప్రిన్సిఫల్ కార్యదర్శులు, స్పెషల్ సి.ఎల్.లతో ఆయన వర్చ్యువల్ సమావేశం నిర్వహించి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబందించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబందించి సమగ్ర సమాచారాన్ని ముందుగానే మంత్రులకు అందజేయాలన్నారు. అంశాల వారీగా గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు మరియు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న చర్యలను స్పష్టంగా తెలిపే సమగ్ర సమాచారాన్ని మంత్రులకు ముందుగానే అందజేయాలని సూచించారు. ఇందుకు సంబందించి శాఖల వారీగా ఉన్న నోడల్ అధికారులను ముందుగానే అప్రమత్త పర్చాలన్నారు. సమావేశాలు నిర్వహించే సమయంలోనే స్టార్డు మరియు అన్ స్టార్డు ప్రశ్నలకు అన్నింటినీ సవివరమైన సమాదానాలు మంత్రులు ఇచ్చే విధంగా వారి తగిని సమాచారాన్ని ఆయా శాఖల కార్యదర్శులు ముందు రోజే అందజేయాలన్నారు. సమావేశాల సమయంలో ఆర్జిత శెలవులు, విదేశీ పర్యటన శెలవులు ఎవ్వరికీ మంజూరు చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శలు, ప్రిన్సిఫల్ కార్యదర్శలు, స్పెషల్ సి.ఎస్.లు ఈ సమావేశంలో వర్చ్యువల్ గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *