Breaking News

మున్సిపాలిటీల్లో పన్నుల బకాయిలు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపాలిటీల్లో పన్నుల బకాయిలు వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ IAS అధికారులను ఆదేశించారు.సచివాలయంలోని రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష చేశారు.రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో పన్నుల వసూలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్తి పన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను వసూళ్లు తక్కువగా ఉండటంతో పట్టణ స్థానిక సంస్థలకు ఆదాయంలో భారీగా లోటు ఏర్పడిందని గుర్తించారు..ఈ సమస్యను అధిగమించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మార్చి నెలాఖరులోపు 100 శాతం పన్ను వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు..పన్నుల వసూలుకు సంబంధించి పలు సూచనలు చేశారు.

-మున్సిపల్ కమిషనర్లు ఖాళీ భూముల యాజమానుల వివరాలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి సేకరించి బకాయిదారులకు నోటీసులు అందించాలి.

-ప్రతి మున్సిపాలిటీ లో పెండింగ్ పన్నుల జాబితా ప్రచురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

-SMS,వాట్సాప్ ద్వారా డిజిటల్ నోటీసులు పంపించి బకాయిల వివరాలు తెలియజేయాలి.ఆన్లైన్ పేమెంట్ లింక్ తో పన్నులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలి.

-ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మున్సిపాలిటీల్లో మౌళిక వసతుల కల్పనలో పన్నుల ప్రాముఖ్యత ను తెలియజేయాలి.

-అత్యధిక పన్ను వసూలు చేసిన మున్సిపల్ కమిషనర్ల ను నగదు పురస్కారాలు,ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చి గౌరవించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *