-రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, మచిలీపట్నం నియోజకవర్గం పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టబుద్రుల శాసనమండలి ఎన్నికకు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని విద్యావంతులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత అందరూ మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
లక్ష్మణరావు పిడిఎఫ్ అభ్యర్థి అనే ముసుగులో పట్టబద్ధుల శాసనమండలి ఎన్నికకు పోటీ పడుతున్నాడని, కానీ ఆ ముసుగు తొలగిందన్నారు. గత రెండు రోజుల క్రితం సాక్షాత్తు వైసిపి అధినేత జగన్ రెడ్డి వారి పార్టీ నాయకుల సమావేశంలో లక్ష్మణరావును గెలిపించాలని పార్టీ నాయకులకు హుకుం జారీ చేయడం రాష్ట్రంలో ఉన్న పట్టబద్రులకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. జగన్ రెడ్డి ఎన్నికకు దూరం అని చెప్పి లక్ష్మణరావుకి మద్దతు పలకడం జగన్ రెడ్డి కుట్రపూరిత బుద్ధిని బయటపెట్టిందన్నారు. గత జగన్ రెడ్డి పాలన లో పట్టబద్రులు, ఉద్యోగులు, టీచర్లు పడిన బాధ, వారికి జరిగిన అవమానాలు వర్ణనాతీతం అన్నారు. గత జగన్ రెడ్డి పాలన లో ఐదు సంవత్సరాలలో పట్టభద్రులైన నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు అన్న విషయం గమనించమన్నారు. విద్య నేర్పే గురువులు, సమాజంలో అత్యంత పూజ్యానీయులైన ఉపాధ్యాయులను బ్రాందీ షాపులు దగ్గర తాగుబోతులను క్యూ లైన్ లో పంపించే డ్యూటీలు వేసి, మద్యాన్ని అమ్మించి, గురువుల ప్రతిష్టను జగన్ రెడ్డి దిగజార్చాడు అన్నాడు. గత జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని దోచి, అప్పులపాలు చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల కాలంలోనే ప్రతి నెల ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షన్ దారులు అందరికీ సొమ్మును వారి ఖాతాలో జమవుతున్న విషయం గమనించమని లుక్కా కోరారు.
ఈ ఏడు నెలల కాలంలో 6 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు రావటానికి చంద్రబాబు, లోకేష్ కృషి చేశారని, తద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు అయిందన్నారు. గతంలో జరిగిన అవమానాలు గుర్తుపెట్టుకోవాలని పిడిఎఫ్ ముసుగులో ఉన్న లక్ష్మణ్ రావుకు ఓటు వేస్తే మరల జగన్ రెడ్డిని గెలిపించినట్లేనని ఓటర్లు జాగ్రత్త వహించి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులకు మద్దతు పలికి ఆలపాటిని గెలిపించాలని లుక్కా అభ్యర్థించారు.
కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యావంతుడు, విద్యాసంస్థలకు అధినేతగా ఉన్నారని, విద్యావంతుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలవారు అని, మన సమస్యలు చంద్రబాబు తో మాట్లాడి పరిష్కరించే శక్తి కలవాడని, గతంలో మూడు సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో మన సమస్యల పట్ల స్పందించి, పరిష్కారం దిశగా చొరవ చూపుతాడని, కావున ఆలపాటి కి ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News