Breaking News

మసీదుల ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో రంజాన్ పండుగ సందర్భంగా మసీద్ ల వద్ద ప్రత్యేక పారిశుధ్య పనులు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శనివారం టెలి కాన్ఫరెన్స్ ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రతి రోజు మసీదుల వద్దకు అధిక సంఖ్యలో ప్రార్ధనల కోసం వస్తారని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. మసీదుల వద్ద నీటి సదుపాయం, వీధి దీపాల ఏర్పాటు ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మసీదుల వద్ద పారిశుధ్య సమస్యలు గుర్తిస్తే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 08632345103కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *