Breaking News

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుండి ప్రారంభమైన నేపథ్యంలో తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస జూనియర్ కళాశాల ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆకస్మిక తనిఖీ చేసి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ తో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రం నందు సీసీ కెమెరాల ఏర్పాటుతో అమరావతి ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానంతో పర్యవేక్షణ జరుగుతోందని, క్యాంపస్ లో మెడికల్ సిబ్బంది క్యాంపు ఏర్పాటు, త్రాగునీరు, తగినంత వెలుతురు, బందోబస్తు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు వివరించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ గారి ఛాంబర్ నందు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణను కలెక్టర్ పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *