విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాహుల్ హత్యకు మాకు ఎలాంటి సంబంధ లేదని గత వైసిపి ప్రభుత్వంలోని మంత్రులు, నాయకులు కావాలనే తనను తనతో పాటు మరి కొందరిని ఇరికించారని కోగంటి సత్యనారాయణ తెలిపారు. శనివారం కృష్ణలంకలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కోగంటి సత్యనారాయణ మాట్లాడుతూ రాహుల్ హత్య కేసులో తనను, తనతో పాటు కోరాడ విజయకుమార్ పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. తాను జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రాహుల్ హత్య పై కొత్త సమాచారం సేకరించానని ఆయన తెలిపారు. రాహుల్ హత్య జరగడానికి ముందు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి దగ్గర ఫ్యాక్టరి ప్రారంభానికి రూ. 40 కోట్లు రూపాయలు రాహుల్ తీసుకున్నారనీ తెలిసిందన్నారు. రాహుల్‌కు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వ్యాపార లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చు అనేది అనుమానం కలిగిందని వివరించారు. ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధలేదని చెప్పుకోవటానికి కొంత సమాచారం సేకరించడానికి నాకు ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది అని చెప్పారు. రాహుల్ ఫ్యాక్టరీ మా కొండపల్లి ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంది. ఆ రకంగా నాకు రాహుల్ పరిచయం అంతేగాని అతనికి నాకు ఎలాంటి సంబంధ లేదు. మా ఇద్దరి మధ్యలో వ్యాపారాలు ఏమి లేవు అని అన్నారు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారనీ రాహుల్ హత్యకు చెందిన నిజాలు బయటకు రావాలంటే కూటమి ప్రభుత్వం వెంటనే ఏపీ సిఐడి, సీబీఐ చేత విచారణ జరపాలనీ కూటమి ప్రభుత్వంను ఆయన కోరారు. కోరాడ విజయకుమార్ మాట్లాడుతూ రాహుల్ హత్య విషమంలో తనను అక్రమ ఇరికించారని నాకు ఎలాంటి సంబంధ లేదన్నారు. తనను పోలీసులు బెదిరించారన్నారు. ఈ కేసు పోలీస్ విచారణ, ఎపీ సీఐడీ, మరియు సీబీఐ చేత విచారణతో పాటు ఈ.డి, ఇన్కమ్ ట్యాక్స్‌ను విచారణ జరపాలని కోరారు.
Prajavartha Online Telugu News