Breaking News

సర్వజనరంజకంగా రాష్ట్ర బడ్జెట్ :మంత్రి కందుల దుర్గేష్

-పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా, తెలుగు భాషాభివృద్ధిపై రాష్ట్ర చిత్తశుద్ధికి నిదర్శంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-వినాశనానికి, పతనానికి ఆనవాళ్లుగా గత ప్రభుత్వ బడ్జెట్ నిలిస్తే అభివృద్ధి, పురోగతికి తార్కాణంగా ఈ ప్రభుత్వ బడ్జెట్ నిలిచిందన్న మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఐదేళ్ల కాలంలో ఏ రకమైన అభివృద్ధి చేయనున్నామో తెలిపేలా రూపొందిందించిన సమగ్ర బడ్జెట్ 2025-26 అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని తన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ రాష్ట్ర బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.పర్యాటక రంగానికి ఇతోధిక సాయం అందించేలా బడ్జెట్ ఉందన్నారు. తెలుగు భాషా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలని గత ప్రభుత్వం తెలుగు భాషను నాశనం చేసిందన్నారు. దానికి భిన్నంగా తెలుగు భాషను పాఠశాల, కళాశాల విద్యలో ఉండేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తెలుగు భాషా వికాసాన్ని కలిగించేందుకు వీలుగా నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. వినాశనానికి, పతనానికి ఆనవాళ్లుగా గత ప్రభుత్వ బడ్జెట్ నిలిస్తే అభివృద్ధి, పురోగతి అంశాలతో రూపొందించిన సమగ్ర బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పోకడలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ, డ్రోన్ ల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం తదితర అంశాలతో కొత్త పుంతలు తొక్కే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బాగుందన్నారు. రైతుకు లాభసాటిగా, ప్రత్యేకించి కౌలు రైతుకు రక్షణ కల్గించే విధంగా రూపొందించిన బడ్జెట్ గా అభివర్ణిస్తూ అన్ని విభాగాల్లో అద్భుతంగా రూపొందించిన బడ్జెట్ అని కొనియాడారు.2025-26 బడ్జెట్ ప్రజామోదంగా, సర్వజన రంజకంగా ఉందన్నారు. ఈ బడ్జెట్ తో రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని మంత్రి కందుల దుర్గేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటి నుండి తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తామని, కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవి తరగతి సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *