విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం 8 నెలలు హనీమూన్ పూర్తి చేసుకొని, ఆకాశంలో ధ్రువ నక్షత్రం లాంటి బడ్జెట్‌ని ప్రవేశపెట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ధ్వజమెత్తారు. శనివారం వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో అభివృద్ధికంటే రాష్ట్ర ప్రజలను దోపిడే చేసుకోవడంలోనే ఎక్కువ శ్రద్ద చూపించారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా చేయాలో చేతకాక జగన్ పై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. జగన్మోహన్రెడ్డి నవరత్నాలను అమలు చేసినప్పుడు మీరు సూపర్ సెక్స్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంపద సృష్టించి, సూపర్ సిక్స్ అమలు చేస్తామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం నేడు ఏ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి రుజువైందని అన్నారు. జగన్ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచారని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్, జిందాలు, రిలయన్స్. ఆదాని వంటి కంపెనీలు పెట్టుబడులు పెడితే అది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కళ్ళల్లో కాంతులు పోయాయని, ఇప్పుడు ఈ బడ్జెట్‌తో పూర్తిగా నిరాశ చెందారని అన్నారు. అమరావతికి విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా కనెక్టివిటీ ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచారన్నారు.
Prajavartha Online Telugu News