-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో గల ఎబిసి ఆపరేషన్స్ సెంటర్, బయోమెతనైజేషన్ ప్లాంట్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సర్జికల్ ఎక్విప్మెంట్ మరింత పెంచి, అనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు మెరుగుపరచటానికి కావలసిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అజిత్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్దన్న బయోమితనైజేషన్ ప్లాంట్ ను సందర్శించి కూరగాయల వ్యర్ధాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రక్రియను పరిశీలించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జి డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, వెహికల్ డిపో ఇన్చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుపాదం, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News