ఐపీఎల్ మ్యాచుల‌కు వైజాగ్ క్రికెట్ స్టేడియం సిద్దం

-ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ప‌రిశీలించిన ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల‌కు ముందు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్రధాన నవీకరణలను ప్రకటించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంతోషంగా ఉందని ఎసిఏ అధ్య‌క్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. వైజాగ్ లోని ఏసీఏ-వీడీసీఏ ( ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్/విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ) స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించడానికి స్టేడియంను సందర్శించారు. ఈ మేర‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈనెల 24, 30వ తేదీల్లో వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడనున్నందున మిగిలిన పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వారు ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రౌండ్ లో ఏర్పాట్లు అధునాతన ఫ్లడ్‌లైట్లు, అంతర్జాతీయ ప్రమాణాల కార్పొరేట్ బాక్స్‌లు స్టేడియం మౌలిక సదుపాయాల పూర్తి పునర్నిర్మాణం జ‌రిపిన‌ట్లు ఎసిఏ అధ్య‌క్షుడు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివనాథ్ ధృవీకరించార‌ని పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌బోయే స‌మయాన్ని ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ కార్పొరేట్ స్టైల్ లో స‌రికొత్త రూపులో క్రికెట్ అభిమానుల‌కు క‌నిపిస్తుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. “రాబోయే ఐపీఎల్ సీజన్‌లో అభిమానులతో పాటు క్రికెట్ జట్లకు మెరుగైన, ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏ.సి.ఏ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామ ప్రశాంత్ , కోశాధికారి దండుమూడి శ్రీనివాస్ , కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్ ల‌తో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ నాయ‌కులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *