Breaking News

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా ఏర్పాట్లు చేయాలి…

-ఆర్ట్స్ కాలేజీలో మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
-వేడుకల సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో అధికారులు భారీగా ఏర్పా ట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్ర శాంతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖ ల అధికారులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఆర్ట్స్ కాలేజీలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలిపారు. పోలీసు, పరిశ్రమల శా ఖ, వైద్య ఆరోగ్యశాఖ, మెప్మా పిడి, డిఆర్డిఏ పిడి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు స్టాల్స్ ఏర్పా టు చేయాలని తెలిపారు.
మహిళల్లో చైతన్యం కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పా టు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.

రానున్న నాలుగూ రోజులు..

5.3.2025 వ తేదీ న సంక్షేమ హాస్టళ్లు కెరీర్ అవకాశాలు, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసు స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్, బొమ్మూరులో ఇంటింటా గోడ పత్రిక అంటించుట,

6.3.2025 వ తేదీన నర్సరీస్,ఆర్టీసీ కాంప్లెక్స్ లో పని చేయుచున్న మహిళలతో, మహిళా చట్టాలు లేబర్ చట్టాలు అవగాహన కల్పించుట

7.3.2025 వ తేదీన మహిళా ప్రాం గణం, బొమ్మూరులో ఆరోగ్యశాఖ అధికారులు, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లకు మహిళా చట్టాలు సమ స్యలపై సమావేశం

8.3.2025 వ తేదీన ఆర్ట్స్ కాలేజీలో మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు

ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పి. డి., కే విజయ కుమారి, జిల్లా పరిశ్రమల శాఖ డిఐఓ వణి ధర్ రామన్, అడిషనల్ ఎస్పీ , ఎన్. బి. యం. మురళీకృష్ణ, డి ఎం అండ్ హెచ్ ఓ, కె .వెంకటేశ్వర రావు, డి ఆర్ డి ఎ, పి డి, ఎన్ వివి ఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *