Breaking News

కేసీ ఆయకట్టు సాగులో ఉన్న పంటలను కాపాడుతాం

-జల వనరుల శాఖ మంత్రి నిమ్మల, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ తో మంత్రి ఫరూక్ భేటీ
-కేసీ రైతుల సమస్యను వివరించిన మంత్రి ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు- కడప కెనాల్ ఆయకట్టు కింద సాగు చేసిన పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడతామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు.ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో రబీ సీజన్ లో వివిధ రకాల పంటలను రైతుల సాగు చేశారు. ఈ పంటలన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.అయితే కేసీ కెనాల్ కు సాగునీటి విడుదలను అధికార యంత్రాంగం నిలిపివేసింది. దీంతో పంటలు సాగు చేసిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, కార్యదర్శి రామసుందర్ రెడ్డి, ఈఎన్ సి వెంకటేశ్వరరావు లకు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వివరించారు. బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రైతుల పరిస్థితిని సమగ్రంగా మంత్రి ఫరూక్ వివరించారు. ఈ విషయంపై మంత్రి నిమ్మల రామానాయుడు, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ లు ఉమ్మడి కర్నూలు జిల్లా జలవనరుల శాఖ అధికారులతో కేసీ ఆయకట్టు లో పంటల పరిస్థితి,నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. కేసీ కింద ఆయకట్టు లో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టులో సాగుచేసిన రైతులు ఆందోళన చేద్దాల్సిన అవసరం లేదని, పంటలను కాపాడేందుకు అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి ఫరూక్ వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *