-ఘనంగా ప్రారంభమైన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం అని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ కమీషనర్ మరియు స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి కె శారదాదేవి ఐ ఏ ఎస్ అన్నారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం నుండి 5 రోజుల పాటు నందు జరుగు అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం మెదటి దశ లో భాగంగా నెహ్రూయువకేంద్ర ఆద్వర్యం లో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మెకానికల్ కాన్ఫరెన్స్ హాల్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో కేరళ లోని 6 జిల్లాలైన కన్నూర్,కొజికోడ్,కాసార్గాడ్, అలపోఝా మరియు త్రిసూర్,కొల్లాం జిల్లాల నుంచి మొత్తం 27 మంది యువతి యువకులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా శారదదేవి ఐ ఏ ఎస్ మాట్లాడుతూ మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతంగా కొనసాగించడం ఇటువంటి యువ సమ్మేళనాల ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జిల్లా రొడ్డు ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మాట్లాడుతూ మెహన్ కుమార్ యువ అంతరాష్ట్ర సమ్మేళనాలు ద్వారా వివిధ రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు మరియు అభ్యాసాల పరిజ్ఞానం రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు బంధానికి దారితీస్తుంది అని తద్వారా భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేస్తుంది అని అన్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కాలేజి ఇంజనీరింగ్ విభాగపు డీన్ వెంకట్రావు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు ఒకరి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం గౌరవించడం మన దేశ సమైక్యత ను తెలియజేస్తుందని ఇటువంటి కార్యక్రమాల ద్వారా దేశం ఎకం అవుతుందని తెలిపారు.
నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ నెహ్రూ యువకేంద్రాల ద్వారా రాష్ట్రాల మధ్య సంప్రదాయాలు, సంస్కృతి మరియు విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించడానికి, 2024-25 సంవత్సరంలో 60 అంతర్ రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ జిల్లా యువజన శాఖ సిఇవో యు శ్రీనివాస్, ఎన్ ఎస్ ఎస్, జిల్లా కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్ k. నరేంద్ర nss ప్రోగ్రామ్ ఆఫీసర్ గౌరవ అతిధులగా హాజరై ప్రసంగించగా, కార్యక్రమం లో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో యువత అలరించారు.
Prajavartha Online Telugu News